శిరోముండనం భాదితుడిని పరామర్శించిన అవంతి శ్రీనివాస్

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి నూతన సంప్రదాయం ప్రారంభం అయ్యింది. దళితులను కొంతమంది అగ్రకులాలకు చెందిన వారు తీవ్రంగా వేధిస్తున్నారు. దళితులను పట్టుకొని వాళ్లకు శిరోముండనం చేయడంఆంధ్రప్రదేశ్ లో అలవాటైంది. అయితే ఇప్పుడు తాజాగా మరో ఘటన బయటపడింది. విశాఖ జిల్లా పెందుర్తిలో శ్రీకాంత్ అనే యువకుడికి బిగ్ బాస్ కార్యక్రమం వల్ల ప్రాచుర్యం పొందిన నూతన్ నాయుడు శిరోముండనం చేశారు. ఇప్పుడు ఈ విషయంపై రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయి. బాధితుడు శ్రీకాంత్ ను మంత్రి అవంతి శ్రీనివాస్‌ పరామర్శించారు. బాధితుడికి ఆయన రూ.50వేల ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ ఘటన జరిగిన 24 గంటల్లో నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. మరోవైపు తెదేపా అధినేత చంద్రబాబు కూడా బాధితుడితో ఫోన్‌లో మాట్లాడారు. న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ కేసులో విశాఖ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఏడుగురిపై కేసు నమోదుచేసి, అరెస్టు చేశారు. వారిలో సినీ నిర్మాత నూతన్‌నాయుడి భార్య సహా నలుగురు మహిళలు ఉన్నారు. నూతన్‌నాయుడు ఇంట్లో సీసీటీవీ కెమెరా ఫుటేజిలను పరిశీలించి, ఆధారాలు సేకరించారు. ఈ కేసు దర్యాప్తులో ఫుటేజిలు కీలకంగా మారాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here