నాకు ప్రాణ హాని ఉంది : అవంతి

Admin - September 29, 2020 / 12:51 PM IST

నాకు ప్రాణ హాని ఉంది : అవంతి

హైదరాబాద్ లోని జరిగిన హేమంత్ హత్య కేసులో అవంతి, ఆమె అత్తమామల విచారణ ముగిసింది. గచ్చిబౌలి పోలీసులు సుమారు 6 గంటల పాటు విచారణ చేసారు. అలాగే ఆ స్టేట్‌మెంట్ ను రికార్డు చేశారు. హేమంత్ హత్యకు ముందు, హత్య తరువాత జరిగిన విషయాలపై అవంతితో పాటు హేమంత్ కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్ రికార్డు చేశారు పోలీసులు. ఇక ఈ విచారణ ముగిసిన అనంతరం అవంతి మీడియాతో మాట్లాడారు.

ఆమె మాట్లాడుతూ.. నా భర్త హేమంత్ హత్య కేసులో నన్ను విచారించి స్టేట్‌ మెంట్ రికార్డు చేశారు. నాకు ఉన్న అనుమానాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లాను. నాకు ప్రాణ హాని ఉంది. నా భద్రతపై పోలీసులు హామీ ఇచ్చారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితులకు బెయిల్ రాకుండా పోరాటం చేస్తాను అని స్పష్టం చేసింది. మా మామకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్స్ ఆడియోలు అన్ని కూడా పోలీసులకు అందజేశామని అవంతి వెల్లడించింది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us