ప్రగతి భవన్ ముందు ఆటో డ్రైవర్ ఆత్మహత్యయత్నం

Advertisement

ప్రగతిభవన్‌ గేటు వద్ద ఓ ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఇప్పుడు కలకలం రేపింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని అసంతృప్తితో ఆటో డ్రైవర్ ఒంటి పై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆటో డ్రైవర్‌ను అడ్డుకున్నారు.

కిరోసిన్‌ పోసుకున్న అతడి పై నీళ్లు పోసి ప్రాణాలు రక్షించారు పోలీసులు. అయితే తెలంగాణ రాష్ట్రం కోసం 2010లో అసెంబ్లీ వద్ద ఆత్మహత్యా్యత్నం చేశానని బాధితుడు వాపోయాడు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బాధితుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఇక ఆ ఆటోడ్రైవర్‌ను అడ్డుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here