‘కిర్రాక్ పార్టీ’ హీరోయిన్ పై దాడి

Advertisement

కన్నడ నటి, కిర్రాక్ పార్టీ సినిమా హీరోయిన్ సంయుక్త హెగ్డే మరియు ఆమె స్నేహితుల పై దాడి జరిగింది. అయితే ఆమె స్నేహితులతో కలసి సంయుక్త బెంగళూరులోని ఒక పార్కులో వర్క్ అవుట్ లు చేస్తుండగా కొంతమంది వ్యక్తులు వారి పై దాడి చేసి వేధించారు. అయితే స్పోర్ట్స్ దుస్తులు ధరించి పబ్లిక్‌లోకి ఎలా వస్తావంటూ ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారని సంయుక్త ఆరోపించింది.

బెంగళూరులోని అగారా సరస్సు సమీపంలో ఉన్న ఒక పార్కులో నా స్నేహితులతో కలిసి వర్క్ అవుట్ చేస్తుండగా బహిరంగంగా క్రీడా దుస్తులను ధరించకూడదని మా పై దాడి చేసారని ఆమె తెలిపింది. అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఆమెను చుట్టుముట్టి, డ్రగ్ కేసులో ఇరికిస్తామని బెదిరించారుని ఆమె ఆరోపించింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here