అట్లీ దర్శకత్వంలో రానున్న ప్రభాస్ మూవీ
Admin - September 4, 2020 / 09:15 AM IST

సాహో మూవీ మిగిల్చిన అపజయాన్ని విజయంతో భర్తీ చేయడానికి యంగ్ రెబల్ స్టార్, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పూర్తిస్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే “రాధేశ్యామ్” మూవీ షూటింగ్ లో ఉండగానే ప్రభాస్ తాను చేయబోతున్న మూవీస్ ను వరుసగా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే నాగ్ అశ్విన్ తో ఒక మూవీ చేయనున్నారు. అలాగే ఓం ప్రకాష్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీలో నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ తో చేస్తున్న మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆదిపురుష్ మూవీలో విలన్ గా సైఫ్ అలీఖాన్ నటించనున్నారు.
అయితే ఇప్పుడు ప్రభాస్ చేయబోతున్న మరో మూవీకి సంబంధించిన విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళ్ లో అగ్ర దర్శకుల్లో ఒకరైన అట్లీ దర్శకత్వంలో కూడా ప్రభాస్ మూవీ చేయనున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై ఇప్పటి వరకు ప్రభాస్ కానీ దర్శకుడు అట్లీ కానీ స్పందించలేదు. ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే వేచి చూడాలి.