టీడీపీ ప్రెసిడెంట్ గా అచ్చెన్నాయుడు?

Advertisement

నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో దీన పరిస్థితిలో ఉంది. అసలు టీడీపీ రాష్ట్రంలో ఉనికి కోల్పోతుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ గా వైసీపీ నాయకులు గుర్తించడం లేదు. 2019 ఎన్నికల్లో వచ్చిన ఓటమిని టీడీపీ నాయకులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. పాతాళానికి పడిపోతున్న పార్టీని కాపాడటానికి టీడీపీ నాయకులు ఊహించలేని మార్పులు చేయబోతున్నారు.

పతనానికి చేరువలో ఉన్న టీడీపీని బ్రతికించాడనికి టీడీపీ అధిష్టానం ప్రయత్నిస్తుంది. టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ గా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుని నియమించడానికి పార్టీలో సన్నాహాలు జరుగుతున్నాయని సమాచరం. ఈఎస్ఐ కుంభకోణంకు సంబంధించిన కేసులో మొన్ననే షరతులతో కూడిన బెయిల్ పొందిన అచ్చెన్నాయుడికి పార్టీ న్పగ్గాలు అప్పగించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వారసుడు లోకేశ్ ను కాకుండా అచ్చెన్నాయుడుని ఎందుకు పార్టీ ప్రెసిడెంట్ గా చేస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here