వై ఎస్ జగన్ మీద అచ్చెన్నాయుడు సెన్సేషనల్ వ్యాఖ్యలు

Ajay G - December 18, 2020 / 12:40 PM IST

వై ఎస్ జగన్ మీద అచ్చెన్నాయుడు సెన్సేషనల్ వ్యాఖ్యలు

అచ్చెన్నాయుడు గురించి తెలుసు కదా. ఆయన మాట్లాడితే మామూలుగా ఉండదు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అయ్యాక.. అచ్చెన్నాయుడు ఇంకా రెచ్చిపోతున్నారు. తాజాగా మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రెచ్చిపోయారు అచ్చెన్నాయుడు.

atchannaidu serious on ap cm ys jagan

atchannaidu serious on ap cm ys jagan

జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిగా అమరావతిని ఒప్పుకున్న జగన్.. ఇప్పుడెందుకు మాట మార్చుతున్నారంటూ.. మండిపడ్డారు. ఇలా పూటకో మాటమార్చే దుర్మార్గుడు.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అమరావతి ఉద్యమ జనభేరి సందర్భంగా అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. సీఎం జగన్ ఇప్పటికైనా తను చేసిన తప్పును ఒప్పుకొని.. అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు.

రాజధానిగా మళ్లీ అమరావతినే ప్రకటించే వరకు అమరావతి రైతుల ఉద్యమం ఆగదని.. ఇది ఒక్క అమరావతి రైతుల కోరిక మాత్రమే కాదని.. యావత్ ఆంధ్రుల కల అని అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతి లాంటి ఉద్యమం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఈ ఉద్యమాన్ని ఎంత నీరు గార్చాలని చూసినా.. అది జరగని పని.. అంటూ అచ్చెన్నాయడు ధ్వజమెత్తారు.

ఒకప్పుడు అదే రాజధానిని ఒప్పుకున్న జగన్.. ఇప్పుడెందుకు మూడు రాజధానులు అంటూ కొత్త పాట పాడుతున్నారని దుయ్యబట్టారు. నేను రాజీనామా చేసుడు కాదు.. ముందు వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలి. రాజధాని విషయంలో ఇటువంటి మూర్ఖత్వపు ఆలోచన చేస్తున్న జగన్ రాజీనామా చేయాలంటూ అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us