జగన్ ని ఎక్కడ ఇరికించాలో అక్కడ ఇరికించిన అచ్చెన్నాయుడు – వైసీపీ లో దడదడ??

Ajay G - December 19, 2020 / 07:04 PM IST

జగన్ ని ఎక్కడ ఇరికించాలో అక్కడ ఇరికించిన అచ్చెన్నాయుడు – వైసీపీ లో దడదడ??

అచ్చెన్నాయుడు.. టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ అయ్యాక దూకుడు పెంచారు. మామూలుగా కాదు.. ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను టార్గెట్ చేసుకొని రెచ్చిపోతున్నారు. బీసీలకు ఇచ్చిన పదవులపై ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన పోరు సాగుతోంది. ఈనేపథ్యంలో.. సామాజిక న్యాయం పేరుతో.. జగన్ ప్రభుత్వం చేస్తున్న పనులు ఇవి.. అంటూ పెద్ద లిస్టునే మీడియా ముందు పెట్టారు అచ్చెన్నాయుడు.

atchannaidu reveals ap govt corruption

atchannaidu reveals ap govt corruption

జగన్ చేసేది కొంచెం.. చెప్పుకునేది మాత్రం చాలా.. స్థానిక సంస్థల రిజర్వేషన్ల కుదింపుతో 16800 మంది బీసీలు తమ పదవులను కోల్పోయారు. ఇదేనా జగన్ సామాజిక న్యాయం. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు అన్నారు కదా.. అంటూ అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.

మేం బీసీలక పెద్ద పీఠ వేస్తాం.. అని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సీఎం జగన్ చెప్పారు. కానీ.. ఇప్పుడు చేసేదేంటి. బీసీల కోసం జగన్ చేసిందేమీ లేదు. ఆయన పదవులన్నీ రెడ్లకు కట్టబెడుతున్నారు. బీసీలకు నడిరోడ్డు మీద నిలబెడుతున్నారు జగన్. రాష్ట్రంలో 50 శాతం జనాభా ఉన్న బీసీలకు ఎందుకు నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు. టీడీపీ హయాంలోనే బీసీలకు పెద్ద పీఠ వేశాం. ఏపీఐఐసీ పదవులు, టీటీడీ పదవులు, తుడా చైర్మన్ పదవులను బీసీలకు అప్పగించాం. కానీ.. మీరు మాత్రం బీసీలకు ఒక్కటంటే ఒక్క పదవిని కూడా ఇవ్వలేదు. ఎక్కడా ఇవ్వలేదు.. అంటూ అచ్చెన్నాయుడు విమర్శించారు.

ఏదో బయటికి చెప్పుకోవడం కోసం.. ఎలాంటి నిధులు లేని కార్పొరేషన్లకు బీసీలను ఏర్పాటు చేశారు. 56 బీసీ కార్పొరేషన్లలో 672 మంది డైరెక్టర్లను నియమించారు. కానీ.. ఏం లాభం అక్కడ నిధులే లేవు. నిధులు, అధికారం ఉన్న స్థానాల్లో మాత్రం ఏకంగా 16800 పదవులకు ఎగనామం పెట్టారు జగన్. ఇదేనా మీరు బీసీలను ఉద్దరించడం అంటే? బీసీలను నట్టేట ముంచిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు.. అంటే అది కేవలం వైఎస్ జగన్ మాత్రమే అంటూ.. వైసీపీ తప్పుడు లెక్కలను మీడియా ముందు పెట్టారు అచ్చెన్నాయుడు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us