మోసం చేస్తున్నారని అచ్చెన్నకు తెలుసు.. కానీ ఏం చేస్తారు.. అందుకే ఇలా..
Admin - October 28, 2020 / 01:06 PM IST

మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని చంద్రబాబు ఆయన మెడకు ఈ పదవిని తగిలించారు. ఎక్కడ అలుగుతాడోనని ఆ పని చేశారు. అచ్చెన్నకు అధ్యక్ష పదవి ఇవ్వడం లోకేష్ కు అస్సలు ఇష్టంలేదని మొదటి నుండి ప్రచారం జరుగుతోంది. తనకు అనుకూలంగా ఉండే నేతలకు ఆ పదవి ఇప్పించాలని చినబాబు చాలా ప్రయత్నించారు. కానీ విపత్కర పరిస్థితుల్లో తప్పక లోకేష్ మాటను కాదని అచ్చెన్నకు పదవి ఇచ్చేశారు చంద్రబాబు.

Chandra babu Atchannaidu
పదవి అయితే ఇచ్చారు కానీ పగ్గాలు మాత్రం లోకేష్ చేతుల్లోనే ఉన్నాయి. అన్నీ ఆయనే చూసుకుంటున్నారు. అచ్చెన్నకు పదవి అలంకారప్రాయం మాత్రమే. అధ్యక్షుడైన అచ్చెన్నను వెనక్కు తోసేయడానికి లోకేష్ ఉరికొస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా పర్యటనలు, పరామర్శలు, ఘాటైన విమర్శలు, అంతర్గత సమావేశాలు చేస్తూ పార్టీ మొత్తాన్ని వేగంగా చుట్టుముట్టే స్తున్నారు. ఇది పక్కా మోసం. పదవిలో కూర్చోబెట్టి వేరొకరు పెత్తనం చేయడం ఏకాడికీ సమంజసం కాదు. ఈ సంగతి అచ్చెన్నాయుడుకు కూడ తెలుసు. తనకు వాడుకుంటున్నారని ఆయనకు ఎరుకే.
కానీ ఏం చెయ్యడం. తిరగబడితే పార్టీ నుండి బయటకు పోవాలి. బయటకంటూ వెళితే ఏదో ఒక పార్టీ అండ తప్పనిసరి. కాబట్టి వైసీపీలోకి వెళ్ళాలి. అలా వెళితే కేసులకు భయపడి వైసీపీలో చేరిపోయారనే అపవాదును మోయాల్సి వస్తుంది. బీజేపీలోకి వెళ్లినా కాపాడమని మోదీ కాళ్ళ మీద పడినట్టు ఉంటుంది. దానికన్నా పార్టీలో పవర్ లెస్ అధ్యక్షడిగా ఉండిపోవడమే మేలని అనుకున్నారు ఆయన. అందుకే తనను వెనక కూర్చోబెట్టి ముందు చెలరేగిపోతున్న లోకేష్ ను చూసి ఏమీ చేయలేక తనకూ టైమ్ రాకపోతుందో అన్నట్టు మౌనంగా ఉండిపోయారు.