Astrologer Venu Swamy : చిరంజీవి వంశానికి ఇక వారసుడు లేనట్లేనా.. వేణు స్వామి బయట పెట్టిన సంచలన విషయాలు
NQ Staff - June 20, 2023 / 06:57 PM IST

Astrologer Venu Swamy : మెగా స్టార్ చిరంజీవి ఇంట మెగా ప్రిన్సెస్ నేడు అడుగు పెట్టిన విషయం తెల్సిందే. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు నేడు అర్థరాత్రి సమయంలో బిడ్డ జన్మించింది. తమకు ఎంతో ఇష్టమైన మంగళవారం పాప జన్మించడం చాలా సంతోసంగా ఉందని.. పాప మంచి ఘడియల్లో పుట్టింది మహర్జాతకురాలు అవుతుందని చిరంజీవి పేర్కొన్న విషయం తెల్సిందే.
రామ్ చరణ్, ఉపాసన దంపతుల యొక్క కూతురు జాతకం ఎలా ఉంటుంది… ఆమె ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని వేణు స్వామి లెక్కలు వేసి మరీ జాతకం చెప్పాడు. వేణు స్వామి మాట్లాడుతూ.. చరణ్, ఉపాసన దంపతుల యొక్క పాప జాతకం అద్భుతంగా ఉందని అన్నాడు. పాపది రాజ యోగం అని.. పాప జన్మించడంతో మెగా కుటుంబానికి రాజయోగమే అన్నాడు.
చిరంజీవి గారి వలే చరిత్ర సృష్టించే విధంగా పాప పెద్దయ్యాక అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. అయితే పాప ఆరోగ్యం పరంగా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నాడు. చెవి మరియు పన్ను సమస్యలతో పాప బాధ పడే అవకాశం ఉందని.. ఆ సమస్యలు ఎక్కువ కాలం ఉండక పోవచ్చు అంటూ వేణు స్వామి పేర్కొన్నాడు.
మరో సంచలన విషయాన్ని వేణు స్వామి ప్రకటించాడు. రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు అమ్మాయి సంతానమే అని.. అబ్బాయి జన్మించక పోవచ్చు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. అంటే చిరంజీవి యొక్క వంశానికి ఇక వారసుడు లేనట్లే అన్నట్లుగా వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మెగా ఫ్యాన్స్ చరణ్ కు కొడుకు పుట్టాలి.. హీరో అవ్వాలని కోరుకుంటున్నారు. కానీ అది సాధ్యం అయ్యేలా లేదని వేణు స్వామి అన్నాడు.