Ashu Reddy Drug Case : డ్రగ్స్ కేసుతో సంబంధం లేదు.. వాళ్ల మీద కేసు పెడుతా.. అషురెడ్డి ఫైర్..!
NQ Staff - June 27, 2023 / 11:15 AM IST

Ashu Reddy Drug Case : ఇప్పుడు టాలీవుడ్ ను మరోసారి డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. రజినీకాంత్ హీరోగా వచ్చిన కబాలి సినిమా నిర్మాత కేపీ చౌదరి రీసెంట్ గా డ్రగ్స్ కేసులో దొరికిపోయి సంగతి తెలిసిందే. అయితే ఆయన ఫోన్ డేటాలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా అషురెడ్డి పేరు మార్మోగిపోయింది.
ఆమెతో ఆయన వందల ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే వాటిపై మొన్న ఓ పోస్టుతో క్లారిటీ ఇచ్చింది అషురెడ్డి. తనకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. అయినా సరే ఆమె మీద ఆరోపణలు ఆగట్లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా వీడియో రిలీజ్ చేసింది అషు.
ఇందులో ఆమె మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా నా మీద కొన్ని ఛానెల్స్ ఏవేవో న్యూస్ రాసేస్తున్నాయి. నా నెంబర్ ను కూడా చెబుతున్నాయి. దాంతో వందల కొద్దీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అసలు నిజాలు తెలుసుకోకుండా అలా ఎలా రాస్తారు. మీ న్యూస్ వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నాను. నేను ఏ తప్పు చేయలేదు. నిజానిజాలు తెలుసుకోకుండా అలా ఎలా రాస్తారు.
కచ్చితంగా నేను దీనిమీద ఫైట్ చేస్తాను. ఆ మీద తప్పుడు వార్తలు రాసిన మీడియా సంస్థల మీద పరువు నష్టం కేసు పెట్టబోతున్నా అంటూ వార్నింగ్ ఇచ్చింది అషురెడ్డి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే కేపీ చౌదరితో తాను ఎందుకు ఫోన్ మాట్లాడాల్సి వచ్చిందో మాత్రం చెప్పలేదు అషురెడ్డి.