Ashu Reddy : అషూరెడ్డి లవ్‌లో పడిందా.? ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే.!
NQ Staff - November 22, 2022 / 04:35 PM IST

Ashu Reddy : బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డి సోషల్ మీడియాలో పిచ్చ యాక్టివ్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది తన ఇన్‌ష్టా అకౌంట్లో అషూ రెడ్డి.
ఆ ఫోటోలను ఎప్పటిలాగే లైక్ చేసే వాళ్లతో పాటూ, కామెంట్ చేసే వాళ్లూ వున్నారు. ఇంతకీ అషూ రెడ్డి ఫోటోల్లో అసలేముంది.? ఆమె లవ్‌లో పడిందనుకోవడానికీ, అసలా ఫోటోలకీ వున్న సంబంధం ఏంటీ.?
సొగసుల గడసరి..

Ashu Reddy Latest Beautiful Photos
ఇటీవల అషూ రెడ్డి యూరప్ టూర్‌ని ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వెకేషన్లో భాగంగా అందమైన లొకేషన్లను తన కెమెరాలో బంధించేసిన అషూ రెడ్డి, తన అందాల ఒంపు సొంపుల్నీ సైతం ఫోటోల్లో బంధించి కుర్రకారును తన ప్రేమలో ఖైదు చేసింది.

Ashu Reddy Latest Beautiful Photos
బ్లాక్ హాట్ అవుట్ ఫిట్‌లో బెడ్డుపై పడుకుని వున్న అషూ రెడ్డి ఫోటోలు అన్నింట్లోనూ చాలా చాలా ప్రత్యేకం. ఆ ప్రత్యేకమైన అనుభవాన్ని వివరిస్తూ, ‘బెడ్ ఈజ్ సో కూల్ అండ్ యు ఆర్ నాట్ హియర్..’ అంటూ వింతైన క్యాప్షన్ పెట్టింది.

Ashu Reddy Latest Beautiful Photos
ఈ క్యాప్షన్ చూసిన నెటిజన్లు అషూ రెడ్డికి లవర్ వున్నాడా.? అని ఆరాలు తీసేస్తున్నారు. కానీ, ఆ బెడ్‌పై పడుకుంటే, ఆ ఫీలింగ్ చాలా విభిన్నంగా వుందంటోంది అషూ రెడ్డి. ఆ ఫీలింగ్స్‌నే ఇలా నెటిజనంలో క్యూరియాసిటీ క్రియేట్ చేసేలా కన్వే చేసిందన్న మాట. మొత్తానికి అషూ రెడ్డి సొగసరే కాదు, బహు గడసరి సుమా.!