Ashu Reddy: రాహుల్‌తో రిలేష‌న్ గురించి చెప్పే స‌మ‌యం వ‌చ్చింది

Ashu Reddy: బుల్లితెర రియాలిటీ షో కార్య‌క్ర‌మం ద్వారా ఫేమ‌స్ అయిన కంటెస్టెంట్స్ రాహుల్ సిప్లిగంజ్, అషూ రెడ్డి. హౌజ్‌లో ఉన్న స‌మ‌యంలో రాహుల్ ..పున‌ర్న‌వితో ఎక్కువ చ‌నువుగా ఉండేవాడు. ఒకసారి ఆమెకు ప్ర‌పోజ్ చేశాడు కూడా. ఇద్ద‌రి మ‌ధ్య ముచ‌ట్లు వింటే వారు బ‌య‌ట‌కు వ‌చ్చాక పెళ్లి చేసుకోవ‌డం ఖాయం అని అంతా అనుకున్నారు. కాని అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ మ‌రో బిగ్ బాస్ కంటెస్టెంట్ అషూ రెడ్డితో చ‌క్క‌ర్లు కొడుతున్నాడు. వీరిద్ద‌రు చాలా చ‌నువుగా ఉన్న‌ట్టు ఇప్ప‌టికే ప‌లు ఫోటోలు బ‌య‌టకు రాగా, ఇద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌ని దీనిపై క్లారిటీ ఎప్పుడు ఇస్తారో అని నెటిజ‌న్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

రాహుల్ సిప్లిగంజ్ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రాములో అషూరెడ్డితో క్లోజ్‌గా దిగిన ఫోటో షేర్ చేస్తూ.. ‘సర్‌ప్రైజ్‌ అనౌన్స్‌మెంట్‌’ అంటూ లవ్‌ సింబల్‌ పెట్టి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ పోస్ట్ చూశాక అంద‌రిలో కొత్త అనుమానాలు మొద‌ల‌య్యాయి. రాహుల్ నిజంగానే అషూ రెడ్డితో ప్రేమలో పడ్డాడా, లేక ప్రమోషనా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ‌తంలో ఇద్ద‌రికి సంబంధించి ప‌లు ప్ర‌చారాలు న‌డ‌వ‌గా, తామిద్దరం జాన్ జిగ్రీ దోస్తులం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వ్యవహారం ఏదో తేడాగా ఉందే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.

రాహుల్ చేసిన పోస్ట్‌కు అషూ రెడ్డి కూడా స్పందించ‌డం విశేషం. అవును దానికి సమయం వచ్చేసింది.. త్వరలోనే అంటూ అషూ కామెంట్ చేశారు. దీంతో ఈ ఇద్దరి వ్యవహారం ఇప్పుడు వైరల్ అవుతోంది. రాహుల్ సిప్లిగంజ్ టాప్ సింగ‌ర్‌గా స‌త్తా చాటుతూ హీరోగాను సినిమాలు చేస్తున్నారు. చిచా అనే పేరుతో రాహుల్ చేసిన సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక అషూ రెడ్డి బుల్లితెర కార్య‌క్ర‌మాల‌తో ఫుల్ బిజీగా ఉంది. అషూ ..అమెరికాలోని డల్లాస్‌లో జ‌న్మించ‌గా, డ‌బ్ స్మాష్ కార్య‌క్ర‌మాల‌తో ఫేమ‌స్ అయింది. జూనియర్‌ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ చల్‌ మోహన్‌రంగ సినిమాలో ఓ పాత్రలో నటించింది.