Ashu reddy: హ్యాండ్ బ్యాగ్‌ల‌కు ల‌క్ష‌లు పోస్తున్న అషూ.. కోపంతోబ్యాగ్ కాల్చేసిన త‌ల్లి.!

Ashu reddy: డబ్‌స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న‌ విశాఖపట్నం అమ్మాయి అషు రెడ్డి. ఇందులో ఆమె చేసిన వీడియోలకు లక్షల్లో వ్యూస్, లైకులు వచ్చేవి. దీనికితోడు అచ్చ సమంతలా ఉండడంతో జూనియర్ సామ్‌గా పేరు కూడా తెచ్చుకుంది. ఈ పాపులారిటీతోనే నితిన్ నటించిన ‘ఛల్ మోహనరంగ’లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ పట్టేసింది.

ashu mother fire ashu reddy (1)
ashu mother fire ashu reddy (1)

సినిమాలు, టీవీ షోస్‌తో పాటు అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాతోను తెగ సంద‌డి చేస్తూ ఉంటుంది అషూ. రీసెంట్‌గా దుబాయ్ వెళ్లి తెగ సంద‌డి చేసిన వ‌చ్చిన అషూ వ‌చ్చేట‌ప్పుడు బోలెడ‌న్ని బ్యాగులు మోసుకొని వ‌చ్చింది. అయితే బ్యాగుల కోసం ల‌క్ష‌లు ఖ‌ర్చు పెడుతుంద‌ని, ఆమె త‌ల్లి గ‌రం అయింది.

బ్యాగుల కోసం ల‌క్ష‌లు పోయ‌డం అవ‌స‌ర‌మా? అని ఆ మ‌ధ్య అషూ త‌ల్లి హ్యాండ్ బ్యాగును నేల మీద‌కు విసిరి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియోను అషూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా విప‌రీతంగా వైర‌ల్ అయింది. త‌ల్లి ఎంత తిట్టినా అషూకు హ్యాండ్ బ్యాగుల మీద ఇష్టం పోలేదు. ఈ మ‌ధ్యే దుబాయికి వెళ్లిన అషూ ఖ‌రీదైన‌ హ్యాండ్ బ్యాగులు కొని ఇంటికి తెచ్చుకుంది.

పైగా ఆ బ్యాగుల‌ను త‌ల్లికి చూపిస్తూ ఒకటి రూ.2,50,000 అని, మ‌రొక‌టి రూ.2,00,00 ఖ‌రీదు అని చెప్పింది. 60 వేలు పెట్టి కొనుక్కున్న హీల్స్‌ను సైతం చూపించింది. వాటికోసం ల‌క్ష‌లు ఖ‌ర్చుపెట్ట‌డంతో ఆమె త‌ల్లికి కోపం క‌ట్ట‌లు తెంచుకుంది. ఎన్నిసార్లు చెప్పినా త‌ను తీరు మార్చుకోవ‌డం లేద‌ని మంటెత్తిపోయింది. డ‌బ్బుల విలువ తెలీదా? అని ఆగ్ర‌హించింది. డ‌బ్బులు నీళ్ల‌లా ఖ‌ర్చు చేస్తున్న అషూకు బుద్ధి చెప్పాల‌నుకుంది.

ఇంట్లో ఉన్న పాత బ్యాగును ఒక‌టి తీసుకుని దానికి నిప్పు పెట్టింది. దీంతో అషూ .. ‘ఏంటి మ‌మ్మీ? నీకేమైనా పిచ్చా..’ అంటూ త‌న కోపాన్ని కంట్రోల్ చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించింది. ఇలా పాత బ్యాగులు కాలిస్తేనే ఇంకోసారి కొత్త బ్యాగుల జోలికి పోకుండా ఉన్న‌వాటినే వాడ‌తావ‌ని వార్నింగ్ ఇచ్చింది త‌ల్లి. కానీ కాసేప‌టికే దుబాయి నుంచి తెచ్చిన‌ కొత్త బ్యాగుల‌ను పూజ గ‌దిలోకి తీసుకెళ్లి బొట్లు పెట్టింది.

‘బంగారం కొన‌మంటే బ్యాగులు కొంటోంది. ఆ బంగారం డ‌బ్బుతోనే బ్యాగులు కొంటుంది, కాబ‌ట్టి దీన్ని కూడా బంగారంగా భావించి దండం పెడుతున్నా’ అని చెప్పుకొచ్చింది. ఏదో ఫ‌న్నీగా ఈ వీడియో క్రియేట్ చేసిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.