Ashok Gajapathi Raju : ఏపీకి ఈ కర్మ తెచ్చి పెట్టింది ప్రజలే.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

NQ Staff - December 2, 2022 / 03:19 PM IST

Ashok Gajapathi Raju  : ఏపీకి ఈ కర్మ తెచ్చి పెట్టింది ప్రజలే.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

Ashok Gajapathi Raju  : ఆంధ్రప్రదేశ్ లో మహిళ లపై అత్యాచారాలు పెరిగి పోతున్నాయని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. రైతుల ఆత్మహత్యలతో పాటు రాష్ట్రంలో నేరాలు ఘోరాలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నాడు.

ప్రజల సొమ్ము దోచుకుని జైలుకు వెళ్లి వచ్చిన వారికి పెడుతున్నారని ప్రభుత్వం తీరుపై ఆయన మండి పడ్డాడు. జైలుకు వెళ్లి వచ్చిన వారిని అందలం ఎక్కించడం కర్మ కాకపోతే మరి ఏంటి.. ఏపీకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏపీ ప్రజలే అంటూ ఓటర్ల పై అశోక్ గజపతిరాజు అసహనం వ్యక్తం చేశాడు.

ఒక్క ఛాన్స్ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడిగిన తీరుతో ఏపీ ప్రజలు మోసపోయారని, ఇక మళ్లీ వైకాపా ను నమ్మే పరిస్థితి లేదు అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు మాట్లాడు కుంటున్నారు.

జగన్ కి ఇచ్చిన ఒక్క ఛాన్స్ పూర్తయిందని.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని దక్కించుకోవడం ఖాయం అంటూ ఆ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ధీమాతో ఉన్నారు. వైకాపా మాత్రం తాము చేసిన అభివృద్ధి పనులు మరియు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ విజయ తీరాలకు చేరుస్తాయని నమ్ముతున్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us