Ashish Vidyarthi Honeymoon Photos Viral On Social Media : 57 ఏళ్ల వయసులో హనీమూన్ వెళ్లిన నటుడు ఆశిష్ విద్యార్థి.. ముసలోడే కానీ..!
NQ Staff - July 12, 2023 / 09:45 AM IST

Ashish Vidyarthi Honeymoon Photos Viral On Social Media :
నటుడిగా ఆశిష్ విద్యార్థికి ఎంతటి పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పోకిరి సినిమాలో ఆయన చేసిన పోలీస్ పాత్రను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఆ సినిమాతో ఆయనకు ఎనలేని గుర్తింపు వచ్చింది. దాంతో వందలాది సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసే అవకాశాలు అందుకున్నారు ఆయన.

Ashish Vidyarthi Honeymoon Photos Viral On Social Media
నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆశిష్ విద్యార్థి. ఈ నడుమ తెలుగు ఇండస్ట్రీలో కనిపించట్లేదు. కానీ హిందీ, బెంగాలీ, మరాఠీ సినిమాల్లో మాత్రం బాగానే చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆయన రీసెంట్ గానే బెంగాళీకి చెందిన 33 ఏళ్ల ఫ్యాషన్ ఎంటర్ ప్రెన్యూర్ రూపాలీ బరువాను రెండో పెళ్లి చేసుకున్నారు.
ఇండోనేషియాలోకి వెళ్లి..

Ashish Vidyarthi Honeymoon Photos Viral On Social Media
గతంలో ఆయనకు ఓ సారి పెళ్లి అయి విడాకులు కూడా అయ్యాయి. అప్పటి నుంచి సింగిల్ గానే ఉంటున్న ఆయన.. రీసెంట్ గా రెండో పెళ్లి చేసుకున్నారు. ఈక్రమంలో ఈ ఇద్దరు ప్రస్తుతం హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఇండోనేషియాలోని బాలిలో హనామూన్ ట్రిప్ ను ఏకాంతంగా ఎంజాయ్ చేస్తున్నారు.

Ashish Vidyarthi Honeymoon Photos Viral On Social Media
ఇందుకు సంబంధించిన ఫొటోలు ఆయన ఇన్ స్టాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఇది ఆయనకు రెండో హనీమూన్ ట్రిప్. గత నెలలో వీరిద్దరూ సింగపూర్ కు హనీమూన్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ వయసులో ఇలా హనీమూన్ కు వెళ్లడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ముసలోడే కానీ మహానుభావుడు అంటూ దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.