Arshdeep Singh : అర్ష్దీప్ నో బాల్స్.. మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలు
NQ Staff - January 6, 2023 / 02:34 PM IST

Arshdeep Singh : శ్రీలంక తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్ లో యువ ఫేసర్ అర్ష్దీప్ సింగ్ వేసిన ఐదు నో బాల్స్ మ్యాచ్ ఫలితాన్ని తారు మార్చేశాయి. ఈ మ్యాచ్ లో భారత్ పై శ్రీలంక 16 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.
దాంతో శ్రీలంక సిరీస్ ని 1-1 గా సమానం చేసింది. అర్ష్దీప్ రెండు ఓవర్లలోనే 5 నో బాల్స్ వేసి 23 అదనపు పరుగులను సమర్పించాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం అర్ష్దీప్ వేసిన నో బాల్స్ అంటూ క్రికెట్ పండితులు మరియు విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు.
సోషల్ మీడియా లో అర్ష్దీప్ కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డాడు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ అధికారులు వెంటనే అతడి యొక్క బ్యాంక్ అకౌంట్ ని పరిశీలించాలని, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ని కూడా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.
అర్ష్దీప్ ఒత్తిడిలో ఉండి నో బాల్స్ వేసి ఉంటాడు అంటూ కొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తుంటే ఎక్కువ శాతం మంది మాత్రం మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడే అవకాశాలు లేకపోలేదు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీలంకతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవాల్సిన అవసరం అర్ష్దీప్ కి ఉండదని క్రీడా పండితులు అభిప్రాయం చేస్తున్నారు.