చూడండి ఎలా గాయాలయ్యాయో… షూ కూడా వేసుకోనివ్వలేదు.. అర్నాబ్ గోస్వామి వీడియో
Ajay G - November 4, 2020 / 07:27 PM IST

రిపబ్లిక్ టీవీ ఫౌండర్, ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు బుధవారం ఉదయం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్ట్ పై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఒక టెర్రరిస్టును అరెస్ట్ చేసినట్టుగా.. ఒక జర్నలిస్టును అరెస్ట్ చేయడమేంటని పలువురు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

arnab goswami claims that he was assaulted
అర్నాబ్ గోస్వామిని తన ఇంట్లో ఉండగానే ఉదయం దాడి చేసి మరి లాక్కొని తీసుకెళ్లి అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. దానికి సంబంధించిన వీడియోలను కూడా మనం చూశాం. అర్నాబ్ ను పోలీసులు దాడి చేసి లాక్కెళ్లడం చూశాం.
ఆయన్ను అరెస్ట్ చేసి అక్కడి నుంచి అలీబాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ మీడియాతో మాట్లాడిన అర్నాబ్ గోస్వామి.. పోలీసులు తనపై దాడి చేయడం వల్ల తన చేతికి గాయాలయ్యాయని.. మెడ పట్టి నెట్టేశారని.. చివరకు తనను షూ కూడా వేసుకోనీయకుండా లాక్కొచ్చారని అర్నాబ్ ఆరోపించారు.
అన్వయ్ నాయక్ అనే ఓ ఇంటీరియర్ డిజైనర్, ఆయన తల్లి ఆత్మహత్య కేసులో అర్నాబ్ ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మరింత విచారణ కోసమే ఆయన్ను అదుపులోకి తీసుకొని రాయ్ గఢ్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.