Gabriella : పెళ్లి కాకుండానే మరోసారి ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్.. ఇదేం విచిత్రం..!

NQ Staff - June 8, 2023 / 10:21 AM IST

Gabriella : పెళ్లి కాకుండానే మరోసారి ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్.. ఇదేం విచిత్రం..!

Gabriella : ఈ నడుమ సినిమా స్టార్లు చేస్తున్న పనులు అందరికీ షాకింగ్ గా అనిపిస్తున్నాయి. విదేశీ కల్చర్ ను మన ఇండియాలోకి తీసుకువస్తున్నారు. డేటింగ్ పేరుతో పెండ్లికి ముందే అన్నీ కానిచ్చేస్తున్నారు. నచ్చితే పెండ్లి చేసుకుంటున్నారు. లేదంటే మధ్యలోనే బ్రేకప్ చెప్పేసి వేరే వారిని ఎంచుకుంటున్నారు.

ఇది కామన్ అయిపోయింది. ఇంకొందరు అయితే పెండ్లికి ముందే పిల్లల్ని కనేస్తున్నారు. తాజాగా నటి గాబ్రియల్లా కూడా ఇదే పని చేసింది. ఆమె కొంతకాలంగా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తో డేటింగ్ చేస్తోంది. అర్జున్ రాంపాల్ కు గతంలో మెహర్ తో పెండ్లి అయింది. 20 ఏళ్ల తర్వాత 2018లో విడాకులు పొందారు.

అప్పటి నుంచి అర్జున్ రాంపాల్ గాబ్రియల్లాతో డేటింగ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరికీ ఇప్పటికే ఆరిక్ రాంపాల్ అనే కొడుకు ఉన్నాడు. ఇప్పుడు మరోసారి ప్రెగ్నెంట్ అయింది గాబ్రియల్లా. కానీ ఇంకా ఇద్దరూ పెండ్లి చేసుకోలేదు. సౌత్ ఆఫ్రికాకు చెందిన గాబ్రియల్లా ఇండియాలో మోడల్ గా చేసింది. నాగార్జున హీరోగా వచ్చిన ఊపిరి సినిమాలో కూడా నటించింది.

Arjun Rampal Is Dating Gabriella

Arjun Rampal Is Dating Gabriella

అనుకోకుండా రాంపాల్ తో పరిచయం కాస్తా డేటింగ్ కు దారి తీసింది. అప్పటి నుంచి ఇద్దరూ ముంబైలో ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. ఇప్పుడు రెండో బిడ్డ కూడా పుట్టబోతోంది. కానీ వీరు మాత్రం ఇంకా పెండ్లి చేసుకోవట్లేదు. వీరు చేస్తున్న పనిపై అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇండియా కల్చర్ ను భ్రష్టు పట్టిస్తున్నారంటూ తిట్టి పోస్తున్నారు నెటిజన్లు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us