Arjun And Jagapathi Babu : హనుమాన్ జంక్షన్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే ఫోటో ఇది
NQ Staff - September 27, 2022 / 12:08 PM IST

Arjun And Jagapathi Babu : హనుమాన్ జంక్షన్ సినిమా గురించి నిన్నటి తరం ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జగపతి బాబు, యాక్షన్ కింగ్ అర్జున్, వేణు ముగ్గురు హీరోలుగా నటించిన ఆ సినిమా ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ గా సాగుతుంది.
ఇప్పటికీ కూడా ఆ సినిమాలోని కామెడీ సన్నివేశాలు
నభూతో న భవిష్యతి అన్నట్లుగా ఉంటాయి అనడంలో సందేహం లేదు. అలాంటి సినిమా మళ్లీ రావడం కూడా సాధ్యం కాదని ప్రేక్షకుల అభిప్రాయం. ఆ విషయం పక్కన పెడితే హనుమాన్ జంక్షన్ సినిమా ని తాజాగా ఈ ఫోటో గుర్తు చేసింది.
జగపతిబాబు మరియు యాక్షన్ కింగ్ అర్జున్ ప్రస్తుతం ఒక సినిమాకు వర్క్ చేస్తున్నారు. అర్జున్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు. ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా తో పరిచయం అవ్వబోతుంది.
సినిమా షూటింగ్స్ సందర్భంగా స్వయంగా అర్జున్ ఇలా జగపతి బాబు యొక్క హెయిర్ డ్రెస్సర్ గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు. యాక్షన్ కింగ్ అర్జున్ తో యాక్షన్ లో ఉన్నాను అంటూ జగపతిబాబు ఈ ఫోటోను షేర్ చేశాడు.
ఈ ఫోటోతో హనుమాన్ జంక్షన్ రోజులను గుర్తు చేశాడు జగ్గూ భాయ్. మళ్లీ అలాంటి సినిమాను వీళ్లు చేయాలంటూ కొందరు విజ్ఞప్తి చేస్తుంటే.. మరి కొందరు హనుమాన్ జంక్షన్ సినిమా నే సీక్వెల్ చేసి వీళ్ళు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలంటూ కోరుకుంటున్నారు. మరి అది సాధ్యమేనా అనేది కాలమే సమాధానం చెప్పాలి.