Ariyana: అరియానా చికెన్ వంట‌కం.. వీడియో వైర‌ల్

అరియానా గ్లోరీ.. ఈ పేరు ఒకప్పుడు ఎవ‌రికి తెలిసేది కాదు. బిగ్‌బాస్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న అరియానా అతి త‌క్కువ స‌మ‌యంలో సెల‌బ్రిటీ స్టేట‌స్ అందుకుంది. ఎప్పుడైతే హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిందో ఇక అప్ప‌టి నుండి అరియానాకు టీవీ షోస్, సినిమా ఆఫ‌ర్స్ క్యూ క‌డుతున్నాయి. రాజ్ త‌రుణ్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న‌ట్టు అప్ప‌ట్లో అనౌన్స్ చేసింది అరియానా. ఇక సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే అరియానా తాజాగా త‌న ఇన్‌స్టాగ్రాములో ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసింది. చికెన్ వంట‌కం వండుతూ తెగ సంతోషిస్తున్నట్టు వీడియోలో క‌నిపించింది. ఈ వీడియోకు నెటిజ‌న్స్ నుండి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వ‌స్తున్నాయి.

అరియానా పెళ్లికి సంబంధించి కొద్ది రోజులుగా ప‌లు వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ హౌజ్‌లో క‌లివిడిగా ఉన్న అరియానా- అవినాష్‌లు రియ‌ల్ లైఫ్‌లో ఒక్క‌టి కాబోతున్న‌ట్టుగా ప్ర‌చారం నడుస్తుంది. ఇప్ప‌టికే పెద్ద‌లు వీరి పెళ్లిపై ఓ నిర్ణ‌యానికి వచ్చిన‌ట్టు తెలుస్తుంది. అతి త్వ‌ర‌లోనే అరియానా- అవినాష్‌లు గుడ్ న్యూస్ చెప్ప‌నున్నార‌ని టాక్. ప్ర‌స్తుతం అవినాష్ జ‌బ‌ర్ధ‌స్త్‌కు దూరంగా ఉన్న ఇత‌ర షోస్ తో బిజీగానే ఉన్నాడు. అరియానా మాత్రం సెలెక్టెడ్‌గా టీవీ షోస్‌, సినిమాలు చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)