Trial Room : షాపింగ్ కి వెళ్ళినప్పుడు ట్రయిల్ రూమ్ ని ఒక్కసారి చెక్ చేసుకుంటున్నారా..!!

Trial Room(ట్రయిల్ రూమ్) : ఇటీవలే మహిళలకు తెలియకుండా ఎక్కడ ఏ కెమెరాలు ఉంటున్నాయి అర్థం కావట్లేదు.. టెక్నాలజీ అందరిని సంతోష పరిచేలా ఉండాలి కానీ ఇలా బాధపెట్టేలా ఉండకూడదు.. చాలామంది టెక్నాలజీ ని తప్పుదోవలో వాడుతూ సమాజానికి పట్టిన చీడ పురుగుల్లా తయారవుతున్నారు.. ఆడవారి ప్రయివేట్ కార్యక్రమాలను సీక్రెట్ గా షూట్ చేసి వారి పరువును బజారులో కలిపేస్తున్నారు. వారికే తెలియకుండా వారు ప్రైవేట్ గా ఉండే కొన్ని ప్లేస్ లలో వారి ఫోటో లు, వీడియో తీసి మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్ లలో పెడుతున్నారు..

are you checking trail room before trail : ట్రయిల్ రూమ్
Are you Checking Trail Room Before Trail

షాపింగ్ మాల్స్ లో, క్లాత్ సెంటర్ లలో, ఛేంజింగ్ రూంలలో రహస్య కెమెరాలు పెట్టి వీడియో లు చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేయడం, వంటివి చేస్తూ వారి కన్నీటికి కారణమవుతున్నారు.. కొంతమంది దీనికి ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి అనర్థాలు జరగకుండా ముందే జాగ్రత్త పడితే మంచిది అంటున్నారు నిపుణులు.. కొన్ని సూచనలు పాటిస్తే ఇలా చేసే వారి అటకట్టించొచ్చు.. ఆ సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఛేంజింగ్ రూమ్ లలో ఎక్కువగా మిర్రర్ లు ఉండడం మనం గమనిస్తాం..ఆ మిర్రర్ లు కొన్ని కొన్ని ఫేక్ మిర్రర్ లు పెట్టి వాటి వెనకాల కెమెరాలు పెడతారు. మరి ఆ మిర్రర్ ఒరిజినల్ అనేది ఎలా తెలుసుకోవాలంటే మీ వేలును ఆ మిర్రర్ కి ఇలా ఈ పిక్చర్ లో చూపించిన విధంగా పెడితే మీ వేలుకి , అద్దంలోని వేలుకు మధ్య గ్యాప్ ఉంటే అది ఒరిజినల్ మిర్రర్ అని, గ్యాప్ లేకపోతే ఫేక్ మిర్రర్ అని పసిగట్టొచ్చు.ట్రయిల్ రూంలో వేలాడబడి ఉండే లైట్ లలోనూ కెమెరాలు ఉంటాయి.. వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే కెమెరా కనిపెట్టవచ్చు. ఇంకా హ్యాంగర్లు, స్క్రూలు, ఇతర ప్రదేశాలు కొంచెం జాగ్రత్తగా వాచ్ చేయాలి. ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే మనం దీనినుంచి తప్పించుకోవచ్చు.

Advertisement