రాజకీయాలలో పవన్ మళ్ళీ బిజీ అయోమయంలో దర్శకులు ..?
Vedha - November 18, 2020 / 09:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున వకీల్ సాబ్ తో పాటు మరో 5 ప్రాజెక్ట్స్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రెడీ అంటే ఒక సినిమా తర్వాత ఒక సినిమా సెట్స్ మీదకి వస్తూనే ఉంటుంది. దర్శకులు అంత పక్కాగా స్క్రిప్ట్ చేసుకొని రెడీగా ఉన్నారట. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఏ మాత్రం గ్యాప్ లేకుండా తను కమిటయిన సినిమాలన్ని ఒక్కొక్కటిగా 2022 లోపు కంప్లీట్ చేసేయాలని గట్టిగా డిసైడయ్యాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సినిమాలు.. రాజకీయాలు రెండు కళ్ళు అయిపోయాయి. కాబట్టి రెండింటి మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి.
ఈ క్రమంలోనే రీసెంట్ గా వకీల్ సాబ్ సెట్ లో అడుగు పెట్టాడు. ఈ నెలాఖరు వరకు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనం కోషియం షూటింగ్ లో జాయిన్ కావాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ కారణంగా క్రిష్ సినిమా కూడా మొదలవాల్సింది మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. కాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా ప్లాన్ చేసుకున్న దర్శకులు మళ్ళీ కొన్ని రోజులు వేయిటంగ్ లో ఉండాల్సి వస్తోందని అంటున్నారు. అందుకు కారణాలు రెండు. ఒకటి గ్రేటర్ ఎలక్షన్ కాగా రెండవది సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక వివాహం.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఈసారి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు సిద్ధం కావాలని పవన్ పార్టీ శ్రేణులకు, నాయకులకు.. నగర పరిధిలోని కమిటీలకు సూచించారని తెలుస్తోంది. కాగా త్వరలో జరగనున్న ప్రచారంలో పవన్ పాల్గొనబోతున్నారు. అలాగే పోలింగ్ ఆ తర్వాత కౌంటింగ్ ఉంటాయి కాబట్టి డిసెంబర్ 4 వరకు పవన్ కళ్యాణ్ షూటింగ్ కి హాజరవడం కష్టమే. ఇక ఇదే నెలలో నిహారిక పెళ్ళి జరగబోతుంది. కాబట్టి ఎంత కాదన్న 15 – 20 రోజుల పాటు షూటింగ్స్ కి పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది.