Malaika Arora : మాజీ భర్తతో కలిసిపోతున్న మలైకా.. అర్జున్ కపూర్‌కు దిమ్మ తిరిగే షాక్..!
NQ Staff - January 28, 2023 / 01:25 PM IST

Malaika Arora : బాలీవుడ్ లో ప్రేమ జంటలకు కొదువే లేదు. అక్కడ చాలా జంటలు విచ్చల విడిగానే తిరుగుతూ ఉంటాయి. ఎంత పెద్ద స్టార్లు అయినా సరే తమ లవర్లను వెంటేసుకుని తిరిగేస్తుంటారు. అక్కడ పెండ్లి అయిన వారు విడిపోయి మరీ తమకు నచ్చిన వారితో తిరుగుతూ డేటింగ్ పేరుతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాంటి వారిలో అందరికన్నా ఎక్కువగా ఫేమస్ అంటే మలైకా అరోరా, అర్జున్ కపూర్ అనే చెప్పుకోవాలి.
మలైకా అరోరాకు గతంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో 1998 లో పెండ్లి అయింది. వీరిద్దరికీ ఓ కొడుకు పుట్టిన తర్వాత 2017లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి మలైకా తనకంటే 12 ఏళ్ల చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. ఈ జంట బహిరంగంగానే తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
హగ్గులు ఇస్తూ..
నచ్చిన ప్లేస్ కు వెళ్తూ పెండ్లి కాకుండానే హనీమూన్ లు కూడా చేసేసు కుంటున్నారు. కానీ పెండ్లి అంటే మాత్రం నో అంటున్నారు. ఇప్పుడు మలైకా అరోరా తన మాజీ భర్తతో కలిసిపోతోంది. ఈ మధ్య ఎక్కువగా ఆయనతో కలిసి ఉంటుంది. ఆయనతో మాట్లాడటం, హగ్గులు ఇవ్వడం కూడా చేస్తోంది.
ఇక తాజాగా వారి కొడుకు అర్హాన్ ఖాన్ ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళుతున్నాడు. ఈ క్రమంలోనే ముంబై ఎయిర్ పోర్టుకు వచ్చిన ఈ జంట కొడుకును ఫ్లైట్ ఎక్కించిన తర్వాత బయటకు వస్తూ డీప్ హగ్ ఇచ్చుకున్నారు. ఇది చూస్తుంటే వారిద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నట్టు కనిపిస్తోంది. త్వరలోనే వీరిద్దరూ మళ్లీ కలిసిపోతారని బాలీవుడ్ మీడియా అంటోంది. అదే జరిగితే అర్జున్ కపూర్‌కు పెద్ద షాక్ తప్పదు.