AR Rahman: అంత‌ర్జాతీయ స్థాయిలో బ‌తుకమ్మ పాట‌.. క‌దిలి వ‌చ్చిన ఆస్కార్ విన్న‌ర్‌

AR Rahman: బ‌తుక‌మ్మ పండుగ‌తో పాట‌ను కూడా విశ్వ‌వ్యాప్తం చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకుంటుంది.ప్రపంచంలో ఎక్కడా మహిళలకంటూ ఒక ప్రత్యేక పండుగ లేదు. కానీ ప్రత్యేకంగా మహిళలు, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ తొమ్మిది రోజులపాటు పూలను పూజించే గొప్ప పండుగ బ‌తుక‌మ్మ‌.

AR Rahman scores music for Bathukamma song
AR Rahman scores music for Bathukamma song

తొమ్మిది రోజుల పాటు రంగురంగుల పూలతో పండగ ముగిసేవరకు పల్లె, పట్టణం తేడా లేకుండా సందడి వాతావరణం నెలకొంటుంది. మహిళలందరు కలసి ఒక్కదగ్గర చేరి ఈ పండగను అంత్యంత వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా తొమ్మిది రోజులుగా ఆటపాటలతో పూల పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. చివరి రోజు జరిగే సద్దుల బతుకమ్మతో గౌరమ్మను సాగనంపడంతో సద్దుల బతుకమ్మకు ముగింపు పలుకుతారు.

ఈసారి బతుకమ్మ పాట మరింత‌ ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈసారి బతుకమ్మ పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తెలుగులో రూపొందించారు. ఈ పాట ప్రముఖ గాయని స్వరంతో ఇప్పటికే సిద్ధం కాగా దానికి ఇటీవల హైదరాబాద్ సమీపంలోని భూదాన్ పోచంపల్లిలో చిత్రీకరణ జరిపారు.

ఇదిలా ఉంటే.. ఈసారి రాష్ట్రంలో 6 నుంచి బతుకుమ్మ పండగ ప్రారంభం కానుంది. ఈలోపే ఈ పాటను విడుదల చేయనున్నారు. అలాగే ఈ సాంగ్ ను ఇతర భాషల్లోకి సైతం అనువదించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈసారి బతుకమ్మ పాట మరింత ఆదరణ పొందనుంది.