ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా పథకంలో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ కనెక్షన్లకు ఇక నుంచి విద్యుత్ మీటర్లు చెల్లిస్తామని తెలిపారు. అయితే రైతులు కట్టావల్సిన చార్జీలను మొత్తాన్ని ముందుగానే రైతుల ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం చెబుతోంది. విద్యుత్ ఉచిత సబ్సిడీని నగదు రూపంలో రైతుల ఖాతాలకు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.

వినియోగం మేరకు వచ్చిన బిల్లులు రైతులే డిస్కౌంట్ గా చెల్లించేలా మార్గదర్శకాలు కూడా రూపొందించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వం నుండి ఎంత సాయం అందుతుందో రైతులకు స్పష్టంగా అర్ధం అవుతుంది అని అంటున్నారు. అయితే ఈ రోజుల్లో విద్యుత్ కంపెనీలకే కట్టని ప్రభుత్వాలు, ఇక నేరుగా ఎలా రైతుల అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేస్తాయన్నది ఊహించలేని విషయం అని చెప్పాలి. ప్రభుత్వం నగదు బదిలీ చేయకపోతే. రైతులే కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here