రాజధాని సమస్యని పరిష్కారించిన మోడీ గవర్నమెంట్
Admin - August 6, 2020 / 09:43 AM IST

అమరావతి: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో రాజధాని మార్పు పై రోజుకో అంశం బయటకు వస్తుంది. మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన తరువాత ఈ ప్రక్రియను తప్పు పడుతూ అమరావతి జేఏసీ నాయకులు రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించారు. దీని పై స్పందించిన కోర్ట్ రాజధాని అంశం కేంద్ర పరిధిలోనిదా లేక రాష్ట్ర పరిధిలోనిదా తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖ అఫిడవిట్ దాఖలు చేస్తూ రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోకి వస్తుందని, ఈ అంశంపై కేంద్రం జోక్యం చేసుకోదని అఫిడవిట్ లో వివరించింది.
అఫిడవిట్ లో కేంద్రం చెప్పిన అంశాలు జగన్ కు ఊరట ఇచ్చే విధంగా ఉన్నాయి. రాజధాని విషయంలో కేంద్రం స్పందించాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. రాజధాని విషయంలో హైకోర్టులో దాఖలైన పిటీషన్లకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చే వరకూ అంటే ఈ నెల 14 వరకు మాత్రం స్టేటస్ కో మెయిన్ టెయిన్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర పరిధిలోకి రాని అంశం గురించి ఇన్ని రోజులు బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఎందుకు పోరాటం చేశారని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. జగన్ లాగే ప్రధాని మోదీ కూడా మాట తప్పి, మడమ తిప్పారని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.