ఏపీ సచివాలయంలో కరోనా అలజడి

Advertisement

ఏపీ లో కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేయలేని పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పటికే ఏపీలో రోజుకు పది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అలాగే ఏపీలో పలువురు రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఒక వైపు ఏపీ సచివాలయంలో కరోనా కలవరపెడుతుంది. ఇక ఇప్పటి వరకు సచివాలయంలో నమోదయిన కరోనా కేసులు సెంచరీ ఏకంగా దాటాయి. ఇప్పటిదాకా సచివాలయంలో మొత్తం 130 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి.

అలాగే ఐఏఎస్ అధికారులకూ పెద్ద సంఖ్యలోనే కరోనా సోకినట్టు తెలుస్తుంది. దీనితో కొన్ని విభాగాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పనులు నిర్వహిస్తున్నారు. ఇక సచివాలయంకు రావాలంటేనే వివిధ శాఖల స్పెషల్ సీఎస్సులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు భయబ్రాంతులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయవాడ తాడేపల్లిలో ఉన్న హెచ్వోడీ కార్యాలయాల్లో అధికారులు విధులు నిర్వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here