Nara Lokesh : లోకేశ్.. నువ్వసలు స్టాన్ ఫర్డ్ లోనే చదువుకున్నావా? మంత్రి ఫైర్?

Nara Lokesh : టీడీపీ నేత నారా లోకేశ్ గురించి తెలిసిందే కదా. ఆయన తొందరపడి ఏదో ఒకటి అధికార పార్టీని అనేస్తారు. ఆ తర్వాత అధికార పార్టీ వైసీపీ నేతలు ఆయన మీద విరుచుకుపడుతారు. నారా లోకేశ్ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆయన ఏది చేసినా ట్వీట్ చేయడమే. బహిరంగంగా మాట్లాడటం తక్కువ. ట్విట్టర్ లో మాత్రం విరుచుకుపడిపోతారు. నారా లోకేశ్ ఈ మధ్య సీఎం జగన్ పై చేసిన కామెంట్లపై మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు.

ap minister suresh fires on nara lokesh
ap minister suresh fires on nara lokesh

ప్రస్తుతం ఏపీలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతున్న నేపథ్యంలో… మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ఒకటో తరగతి నుంచి 9 వ తరగతి వరకు అందరు విద్యార్థులన ప్రమోట్ చేసినట్టు ప్రకటించారు. అలాగే… రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్న విద్యార్థులను కూడా ఖాళీ చేయించామని… హాస్టళ్లను మూసేశామని ఆయన స్పష్టం చేశారు.

అయితే… టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంకా సమయం ఉండటంతో… అప్పటి వరకు కరోనా పరిస్థితులను అంచనా వేసి ఆ తర్వాత పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. అయితే… స్కూళ్లపై, కాలేజీలపై సీఎం జగన్ పై నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. అసలు… లోకేశ్ స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలోనే చదువుకున్నారా? నిజంగానే ఆయన స్టాన్ ఫర్డ్ డిగ్రీలు నిజమైతే… ఆయన ప్రభుత్వాన్ని అభినందించాలి కానీ… ఇలా విమర్శించడం ఏంటి? సీఎం జగన్ పై లోకేశ్ చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే లోకేశ్ ను అందరూ ఎర్రినాయుడు అని పిలుస్తారు. అసలు నువ్వు స్టాన్ ఫర్డ్ లో ఎలా చదువుకున్నావో అందరికీ తెలుసు. ఎవరో ఫీజులు కడితే… ఎవరో పరీక్షలు రాస్తే… నువ్వు స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నా అని చెప్పుకుంటున్నావు కదా అంటూ మంత్రి సురేశ్ ఎద్దేవా చేశారు.

ఇప్పటికే గత సంవత్సరం పరీక్షలు నిర్వహించలేకపోయాం. ఈ సంవత్సరం కూడా పరీక్షలు నిర్వహించకుండా రెండు సంవత్సరాలు ఇలాగే ముందుకు వెళ్తే విద్యార్థులు చాలా నష్టపోతారు. ఆ విషయాన్ని లోకేశ్ ఎందుకు అర్థం చేసుకోవడం లేదు.. అని మంత్రి మండిపడ్డారు.

Advertisement