AP Minister Gudivada Amarnath : రెండు నెలల్లో ఏపీ రాజధాని మారబోతుందట

NQ Staff - January 21, 2023 / 03:06 PM IST

AP Minister Gudivada Amarnath : రెండు నెలల్లో ఏపీ రాజధాని మారబోతుందట

AP Minister Gudivada Amarnath : మూడు రాజధానుల విషయంలో వైకాపా ప్రభుత్వం వెనక్కు తగ్గదని మరోసారి నిరూపితం అయింది. తాజాగా ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్  చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నేటి నుండి సరిగ్గా 2 నెలల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం అవతరించబోతుందని ఆయన పేర్కొన్నారు.

రాబోయే రెండు నెలల్లో ప్రభుత్వ కార్యకలాపాలు అన్నీ కూడా విశాఖపట్నం నుండి జరగబోతున్నాయని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం కోర్టులో రాజధానుల వివాదం కొనసాగుతూ ఉండగా మంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

విపక్షాల నుండి ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ వెనకడుగు వేయడం లేదని, రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వం ముందడుగు వేయబోతుందని మంత్రి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది.

మూడు రాజధానుల విషయమై ఈ మధ్య కాలంలో కాస్త సైలెంట్ గా వాతావరణం ఉంది అనుకుంటూ ఉండగా మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా అమరావతి వాసులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కలిసి వైకాపా మూడు రాజధానుల నిర్ణయంపై ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. సరిగ్గా రెండు నెలల్లోనే రాజధాని మారబోతుందని మంత్రి చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి అనేది ఆ పార్టీ నాయకులకే తెలియాలి.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us