ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో న్యాయవాది శ్రవణ్ పిటిషన్ ను అంగీకరించిన హై కోర్ట్

Advertisement

ఏపీలోని హై కోర్ట్ జడ్జ్ ల యొక్క ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయని ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. ఈ కథనం చదివిన పాఠకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ కథనం తరువాత కొంతమంది జడ్జ్ లకు సంబంధించిన స్వీయ అనుభవాలను రాసుకొచ్చారు. కొన్ని ఫేక్ లింక్స్ పంపుతూ వాటిని క్లిక్ చేసిన తరువాత ఫోన్స్ ను ట్యాప్ చేస్తున్నారని వెల్లడించారు. అయితే ఈ కథనంలో ఎక్కడా కూడా ట్యాప్ ఎవరు చేస్తున్నారనే విషయాన్ని ప్రచురించలేదు కానీ ఈ కథనాన్ని వైసీపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఆంధ్రజ్యోతి పత్రికకు క్షేమాపణలు చెప్పాలని నోటీసులు జారీ చేశారు.

ఇదిలా ఉండగా జడ్జిల ఫోన్ ట్యాపింగ్ పై, తాను హైకోర్టు లో పిల్ వేస్తున్నట్టు మాజీ జడ్జి న్యాయమూర్తి, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్రవణ్‌కుమార్ వెల్లడించారు. ఇది అత్యంత దారుణమైన విషయమని, మన దేశంలో ఎప్పుడు ఇలాంటి పరిణామం జరగలేదని, దీని పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని వెల్లడించారు. శ్రవణ్ పిటిషన్ ను విచారణకు ఇవ్వాళ హై కోర్ట్ అంగీకరించింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో ఎక్కడి వరకు వెళ్తుందో వేచి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here