నిమ్మగడ్డకు హై కోర్టు సూచన.. వెళ్లి గవర్నర్ ని కలవండి..!
Admin - July 24, 2020 / 07:39 AM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమిస్తున్నట్లు ఏపీ గవర్నర్ బిశ్వబ్యూషన్ హరిచందర్ ఉత్తర్వులు జారీ చేసాడు. అలాగే నిమ్మగడ్డను స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నియమించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి గవర్నర్ లేఖ కూడా రాసారు.
మే 29 వ తేదీన హై కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం వెంటనే ఈసీ గా నిమ్మగడ్డను నియమించాలని ఆ లేఖలో పేర్కన్నారు. ఇక వివరాల్లోకి వెళితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయినా నిమ్మగడ్డను తొలగిస్తున్నట్లు జారీ చేసిన జీవోలు అన్ని కూడా హై కోర్ట్ కొట్టివేసింది. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
స్టేట్ ఎలక్షన్ కమిషనర్ విషయంలో నిబంధనలను మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ ను కొట్టివేసింది ధర్మాసనం. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఇప్పటి నుండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఈసీ గా కోనసాగించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి తీర్పు ఇచ్చింది.
ఇక హై కోర్ట్ ఇచ్చిన తీర్పును ఏపీ సర్కార్ నిరాకరించింది. దీనితో ఏపీ సర్కార్ సుప్రీం కోర్ట్ కు వెళ్ళింది. హై కోర్ట్ ఇచ్చిన తీర్పుకు స్టే ఇవ్వాలని పలుమార్లు కోరింది ఏపీ సర్కార్. చివరకు సుప్రీం కోర్ట్ కూడా నిరాకరించింది. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి మూడు సార్లు నిరాకరించినా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయకుండా.. కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని నిమ్మడ్డ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్పై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం.. గవర్నర్ను కలిసి హైకోర్టు తీర్పు ప్రకారం తనను ఎస్ఈసీగా నియమించాలని కోరాలని సూచించింది. హైకోర్టు ఆదేశాల మేరకు రమేశ్ కుమార్ సోమవారం గవర్నర్ కలిసి వినతిపత్రం అందజేశారు.అలాగే ఎస్ఈసీగా తనను నియమించాలని కోరారు. దీనిపై స్పందించిన గవర్నర్ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఇక మొత్తానికి ఏపీ ఎలక్షన్ కమిషనర్ గా కొనసాగబోతున్నాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్