ఏపీ హైకోర్టు జడ్జికి చిర్రెత్తుకొచ్చింది – ఒక్కసారిగా సంచలన తీర్పు???
Ajay G - December 28, 2020 / 07:44 PM IST
డాక్టర్ సుధాకర్ కేసు తెలుసు కదా. కరోనా వచ్చిన మొదట్లో ఈ కేసు పెద్ద సంచలనం అయింది. డాక్టర్లకు మాస్కులు లేవు.. ఏం లేవు.. ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదంటూ.. డాక్టర్ సుధాకర్ ప్రభుత్వాన్ని నిలదీయడంతో ఆయనను సస్పెండ్ చేసి.. తర్వాత పిచ్చోడిగా ముద్రేశారు. ఆ కేసు ఏపీ హైకోర్టు దాకా పోయింది. తర్వాత కేసును హైకోర్టు.. సీబీఐకి అప్పగించింది. దీనిపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. అయితే.. విచారణ సందర్భంగా సీబీఐ ఈ కేసుకు సంబంధించి సమర్పించిన నివేదికపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిజానికి ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు.. నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఈ కేసుకు సంబంధించి వాస్తవాలు బయటకు రాకుండా చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని.. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని.. సుధాకర్ తల్లి డిమాండ్ చేశారు. దీంతో వెంటనే హైకోర్టు ఈకేసును సీబీఐకి అప్పగించింది.
వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ కేసును విచారించింది. సుధాకర్ ను అరెస్ట్ చేసినప్పటి నుంచి.. తర్వాత జరిగిన పరిణామాలపై నివేదికను రూపొందించి హైకోర్టుకు సమర్పించింది. అయితే.. నివేదికను పరిశీలించిన కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదిక సరిగ్గా లేదని… ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలంటూ సీబీఐని ఆదేశించింది. దానితో పాటుగా.. ఈ కేసుకు సంబంధించి ఒక పర్యవేక్షణాధికారిని నియమించాలని కోర్టు సూచించింది.
ఈ కేసుకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను మార్చి 31 లోగా సీబీఐ కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసి… తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది.