ఏపీ లో మూడు రాజధానులకు హై కోర్ట్ స్టే

Admin - August 4, 2020 / 11:40 AM IST

ఏపీ లో మూడు రాజధానులకు హై కోర్ట్ స్టే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం పలికిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా మూడు రాజధానుల బిల్లుపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. ఈ నెల 14 వరకూ రాజధానుల బిల్లుపై హైకోర్టు స్టే విధించింది. అయితే గవర్నర్ జారీ చేసిన గెజిట్ ని నిలిపివేయాలి అని హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు అయింది. మూడు రాజధానుల బిల్లులు రాజ్యాంగ విరుద్దం అని పిటీషనర్ లు కోర్ట్ దృష్టికి తీసుకుని వెళ్ళారు.

దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం 14 వరకు యధాతధ స్థితిని కొనసాగించాలి అని ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 14 లోపు కౌంటర్ దాఖలు చేయాలి అని ఏపీ హైకోర్ట్, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ తరుపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేయడానికి 10 రోజుల సమయం కోరారు. అలాగే అమరావతి పరిరక్షణ సమితి సహా కొంతమంది రైతులు కూడా ఏపీ హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు జారీ చేసారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us