Big Breaking : ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్ర ప్రదేశ్ పరిషత్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. పరిషత్ ఎన్నికలపై ఉన్న ఉత్కంఠ వీడింది. రేపు అంటే ఏప్రిల్ 8న యథావిధిగా ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో పరిషల్ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఎన్నికలకు రెండు రోజుల ముందు సింగిల్ జడ్జి స్టే ఇవ్వడంతో… ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా? అన్న సందేహం అందరిలో నెలకొన్నది.

ap high court division bench green signal to ap parishad elections
ap high court division bench green signal to ap parishad elections

అయితే…. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చి మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. పరిషత్ ఎన్నికలు యథావిధిగా జరుగుతాయని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.

అయితే… తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పరిషత్ ఎన్నికల ఫలితాలను ప్రకటించవద్దని హైకోర్టు ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది.

Advertisement