AP High Court Dismissed Case Against Chiranjeevi : చిరంజీవికి భారీ ఊరట.. 9 ఏళ్ల నాటి కేసును కొట్టివేసిన హైకోర్టు..!

NQ Staff - July 26, 2023 / 10:59 AM IST

AP High Court Dismissed Case Against Chiranjeevi : చిరంజీవికి భారీ ఊరట.. 9 ఏళ్ల నాటి కేసును కొట్టివేసిన హైకోర్టు..!

AP High Court Dismissed Case Against Chiranjeevi :

మెగాస్టార్ చిరంజీవి మొదటి నుంచి వివాదాలకు దూరంగానే ఉంటారు. అందుకే ఆయన మీద పెద్దగా కేసులు కూడా నమోదు కావని చాలామంది అనుకుంటారు. కానీ ఆయన మీద 9 ఏళ్లుగా ఓ కేసు కోర్టులో నడుస్తోంది. ఈ విషయం చాలామందికి తెలియదు. అయితే ఇన్నేళ్ల తర్వాత ఆ కేసును హైకోర్టు కొట్టేసింది.

దాంతో ఆయనకు భారీ ఊరట లభించింది. అసలు విషయంలోకి వెళ్తే.. చిరంజీవి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. ఆ సమయంలో ఎన్నికల రూల్స్ కు విరుద్ధంగా రాత్రి 10 గంటల తరువాత ప్రచారం చేశారని.. దాని వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని చిరంజీవిపై గుంటూరు అరండల్‌ పేట పోలీసులు కేసు నమోదు చేశారు.

హైకోర్టులో పిటిషన్..

అయితే ఈ కేసుపై అప్పట్లో గుంటూరు రైల్వే కోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది. ఆ సమయంలోనే ఆ కేసును కొట్టేయాలని, రైల్వే కోర్టులో విచారణను ఆపేయాలంటూ చిరంజీవి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు నిన్న (జులై25) విచారణకు వచ్చింది. ఇక మెగాస్టార్ తరఫున లాయర్ ఏ స్వరూపారెడ్డి వాదనలు వినిపించారు.

AP High Court Dismissed Case Against Chiranjeevi

AP High Court Dismissed Case Against Chiranjeevi

ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఆ కేసును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. గతంలో 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం సినిమాల్లోనే బిజీగా గడిపేస్తున్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us