AP Govt : ప్రయాణికుల‌కి ఝ‌ల‌క్ ఇచ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. మాస్క్‌ లేక‌పోతే అంతే..!

AP Govt : క‌రోనా కేసులు రోజు రోజుకి రెట్టింపు అవుతున్నాయి. ఈ స‌మ‌యంలో ప్ర‌భుత్వాలు పలు జాగ్ర‌త్త‌లు తెలియ‌జేస్తూ కొన్ని కండీష‌న్స్ పెడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24గంటల్లో 1257పాజిటివ్ కేసులు మోదైనట్లుగా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ కేసుల తీవ్రత రికవరీ రేటు కంటే సుమారు 10రెట్లు అధికంగా నమోదవడంతో ప్రభుత్వం, వైద్య,ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.

AP Govt fine collect in bus passengers who with out mask
AP Govt fine collect in bus passengers who with out mask

ఈ వారం రోజుల్లో సంక్రాంతిని పురస్కరించుకొని తెలంగాణ లోని హైదరాబాద్ , తమిళనాడు లోని చెన్నై , కర్నాటక రాజధాని బెంగుళూరు ,ముంబై నుంచి వేలాది మంది ఆంధ్రప్రదేశ్‌కు వస్తారు. ఈనేపధ్యంలోనే వారిని రానివ్వకుండా ఆంక్షలు పెట్టడం కుదరని పరిస్థితుల్లో ఈ విధంగా మాస్కులు ధరించడం తప్పని సరి చేస్తే కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టవచ్చని ఏపీ ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది.

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం తప్పని సరి చేస్తూ ప్రభుత్వం నూతన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా మాస్కులు పెట్టుకోకుండా బస్సుల్లో ప్రయాణిస్తే వారి దగ్గర 50రూపాయలు జరిమానా రూపంలో వసూలు చేస్తామని ప్రయాణికుల్ని హెచ్చరించింది. ముఖ్యంగా సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు వారి క్షేమం కోసం కోవిడ్ నిబంధనలు తప్పక పాటిస్తూ ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేసింది.

రాష్ట్రానికి థర్డ్‌వేవ్‌ ముప్పు తప్పదని ప్రజల్ని హెచ్చరిస్తూనే ఎక్కడిక్కడ ముందస్తు ఏర్పాట్లు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న నమోదైన కోవిడ్ కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలోనే నమోదవడం ఒకింత భయాందోళనలను కలిగిస్తోంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 254పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రేణిగుంట విమానాశ్రయం, తమిళాడు సరిహద్దు ప్రాంతాలు చిత్తూరు జిల్లాకు ఆనుకొని ఉండటం కారణంగానే కేసులు పెరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు.

శనివారం నుంచి ఏపీలోని 13జిల్లాల్లో నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. కోవిడ్ కేసుల సంఖ్య మరింత పెరిగితే వీకెండ్‌ కర్ఫ్యూతో పాటు పండుగ వేడుకలకు కూడా కొత్త నిబంధనలు విధించే అవకాశం లేకపోలేదు.