ఏపీ లో మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం
Admin - July 31, 2020 / 12:04 PM IST

ఏపీ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఆ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపారు. దీనితో మూడు రాజధానులకు అధికారికంగా అనుమతి లభించింది. ఇక మూడు రాజధానులలో… ఏపీకి శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూల్ మారనున్నాయి. సీఆర్డీఏ చట్టం-2014 రద్దు బిల్లుతో పాటు, ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లులకు జనవరి 20వ తేదీన ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది.
ఇక బిల్లులపై చర్చ జరపడానికి శాసన మండలికి పంపగా అక్కడ ఎలాంటి చర్చ జరుగలేదు. అలాగే అప్పుడు వాయిదా పడడంతో మూడు వారాల క్రితం గవర్నర్ ఆమోదానికి పంపారు. న్యాయసలహాల అనంతరం గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. అదే సమయంలో సీఆర్డీఓ చట్టం-2014 బిల్లును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదించడం తో శాసన ప్రక్రియ పూర్తయ్యిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.