3 Capitals : మూడు రాజధానుల బిల్లు ఉప‌సంహ‌ర‌ణ‌.. మ‌రికొద్దిసేప‌ట్లో ప్ర‌క‌ట‌న చేయ‌నున్న జ‌గ‌న్

3 Capitals : మూడు రాజధానుల బిల్లుపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దానిని ఉపసంహారించుకున్నట్లు తెలుస్తుంది. మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తెలిపింది. ఈ విషయాన్ని అడ్వకేట్ జనరల్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. రాజధానుల అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఏజీ దాఖలు చేసిన అఫిడవిట్ లో పొందుపర్చారు.

TheNewsQube-
ap government took back 3 capital bill
ap government took back 3 capital bill

ఓవైపు మంత్రివర్గ సమావేశం జరుగుతుండగానే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. బిల్లు వెనక్కి తీసుంటున్నట్లు అసెంబ్లీలో ప్రకటించి కొత్త బిల్లును సీఎం జగన్ ప్రవేశపెట్టనున్నారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి కొడాలి నాని ఇదే విషయాన్ని వెల్లడించారు. కేబినెట్ నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తామన్నారు

ప్రస్తుతం ఉన్న బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని.. కొన్ని మార్పులతో కొత్తగా మళ్లీ సభలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడుతుందనే చర్చ కూడా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉంటాయని 2019 డిసెంబర్ 17న సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయరాజధానిగా కర్నూలును నిర్ణయించినట్లు ప్రకటించారు.

అప్పటి నుంచి రాజధానికి భూములిచ్చిన అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఉద్యమం ఇప్పటికి 700 రోజులు దాటింది. ప్రస్తుతం రాజధాని రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో అమరావతి నుంచి తిరుపతికి మహాపాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది.

మరోవైపు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన 57 పిటిషన్లపై రోజువారీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు