15000 గ్రామాల్లో డిజిటల్ లావాదేవీలను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం

Advertisement

జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టడంలో జోరు చూపిస్తుంది. కొన్ని రోజుల క్రితమే వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన జగన్ మరో నూతన అభివృద్ధి విధానానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని దాదాపు 15000 గ్రామాల్లో యూపీఐ బేస్డ్ డిజిటల్ లావాదేవీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమం వల్ల గ్రామాల్లో డిజిటల్ లావాదేవీలు పెరగనున్నాయి. మేక్ ఇన్ ఇండియాను సాకారం చేయడానికి ఇదొక పెద్ద ప్రయత్నం.

కరోనా సమయంలో డిజిటల్ లావాదేవీలను మొదలుపెట్టడం సరైన నిర్ణయం తీసుకున్నారని, దీని వల్ల కొంతవరకు ఫిజికల్ కాంటాక్ట్ ను నివారించవచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల గ్రామాల్లో సాంకేతికతపై అవగాహన పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ డిజిటల్ లావాదేవీలపై సామాన్య ప్రజలకు ఉన్న అనుమానాలకు గ్రామ వాలంటీర్లు వివరణ ఇవ్వనున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here