అంతర్వేది ఘటన పై సీబీఐ దర్యాప్తు

Advertisement

ఏపీ తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రథం ఆహుతైన ఘటన పై సీబీఐ దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి‌ నిర్ణయించినట్టు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.అయితే ‘‘రథం అగ్నికి ఆహుతైన ఘటనను సీఎం జగన్ సీరియస్ ‌గా తీసుకున్నారు. ఈ ఘటనకు కారణమైన నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించాల్సిందేనని అన్నాడు.

అలాగే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డీజీపీని సీఎం ఆదేశించారు. ఆ మేరకు హోం శాఖకు డీజీపీ కార్యాలయం ఓ లేఖ రాసింది’’ అని ఆ ప్రకటనలో సీఎం కార్యాలయం తెలిపింది. ఏపీలోని దేవాలయాల్లో రథాల రక్షణపై దేవాదాయశాఖ దృష్టి సారించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయశాఖ ఆలయాల్లో చిన్నవి, పెద్దవి కలిపి మొత్తం 405 రథాలు ఉన్నట్లు స్పష్టం చేసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here