ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

Advertisement

ఏపీ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే ఉచిత విద్యుత్ పథకంలో నగదు బదిలీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం పలికింది. అలాగే రైతులకు అందే విద్యుత్ ఎప్పటికీ ఉచితమే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోము అని తెలిపింది. అన్ని వ్యవసాయ కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తామని పేర్కొంది.

కనెక్షన్ ఉన్న రైతు పేరు మీదనే బ్యాంక్ ఖాతా ఉండాలని తెలిపింది. అలాగే వచ్చే 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ పథకానికి డోకా లేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొంది. 10 వేల మెగవాట్ల సోలార్ విద్యుత్ రూపకల్పనకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అయితే ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఒక్కో రైతు పై ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 49,600 రూపాయలు అని వివరించింది.

శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నామని, ఏప్రిల్ 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్ పథకం అమలు కానుంది. అలాగే రాయలసీమ కరువు నివారణ సాగునీటి ప్రాజెక్టులకు ఆమోదం పలికారు. రమ్మీ, పోకర్ వంటి ఆన్ లైన్ గేమింగ్ పేకాటలను నిషేధిస్తూ చట్టంలో నిర్ణయం తీసుకుంది. అలాగే పేకాట రాయళ్ళు పేకాట ఆడుతూ దొరికితే కఠినమైన శిక్షలు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఏపీ రాష్ట్రం‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ను‌ ఏర్పాటుకు ఆమోదం పలికింది. అలాగే విజయనగరం జిల్లాలో సుజల స్రవంతి పథకానికి ఆమోదం పలికింది. వెస్ట్ గోదావరి జిల్లాలో ఫిషరీస్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అలాగే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు స్థలాలు కేటాయించింది. పంచాయతీ రాజ్‌ శాఖలో డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ పోస్టులకు కూడా ఆమోదం పలికింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here