పరిశ్రమలకు కూడా ఆధార్ ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం

Advertisement

ఏపీ ప్రభుత్వం రోజుకో నూతన విధానాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు. నిన్ననే వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నూతన విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ విధానం ద్వార రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమకు ఆధార్ తరహాలో ఒక ప్రత్యేక సంఖ్య ఇవ్వనున్నారు. దీనికోసం రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల సర్వే నిమిత్తం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సర్వేలో పరిశ్రమలోని కార్మికులు, విద్యుత్, భూమి, నీటి లభ్యత గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. ఎగుమతి-దిగుమతి, ముడిసరుకు లభ్యత, మార్కెటింగ్ సహా మొత్తం 9 అంశాల వివరాలను పరిశ్రమ శాఖ సేకరించనుంది. మొబైల్ యాప్ తో గ్రామ, వార్డ్ సచివాలయం ద్వారా ఈ సర్వే చేయనున్నారు. ఆక్టోబర్ 15నాటికీ ఈ ప్రక్రియ పూర్తీ కానుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here