ఇంటర్ సిలబస్ ను తగ్గిస్తున్న ఏపీ ప్రభుత్వం

Advertisement

అమరావతి: కరోనా వల్ల దేశంలో ఈ సంవత్సరం విద్యా ప్రణాళిక పూర్తిగా దెబ్బతింది. అన్ని బాగుండి ఉంటే విద్యార్థులకు సగం విద్య సంవత్సరం పూర్తి అయ్యేది. కానీ కరోనా వల్ల ఇప్పటికీ ఇంకా విద్య సంవత్సరం ప్రారంభం కాలేదు. ఈ సంవత్సరం విద్య విధానంలో ఏపీ ప్రభుత్వం కొన్ని మార్పు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఈ సంవత్సరం విద్య సంవత్సరంలో ఇంటర్ సిలబస్ నుండి 30% సిలబస్ ను తగ్గిస్తున్నట్టు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది.

మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రమే కాకుండా రెండవ సంవత్సరం విద్యార్థలకు కూడా సిలబస్ ను తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పులకు సంబందించిన విషయాలు ఇంటర్ బోర్డ్ కు సంబంధించిన ఆఫీషల్ వెబ్ సైట్ ఉన్నాయని, విద్యార్థులు అక్కడి నుండి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ లో పాఠశాలలను, కళాశాలను ప్రారంభించడానికి ఏపీ ప్రభత్వం ప్రయత్నాలు చేస్తుంది. అలాగే ఇప్పటికే ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here