రైతులకు ఉచిత కరెంట్ ను కట్ చేయనున్న ఏపీ ప్రభుత్వం

Advertisement

ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం త్వరలో షాక్ ఇవ్వనుంది. రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది. జీతాలు, పెన్షన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు చట్టాల ప్రకారం తీసుకోవాల్సిన అప్పు దాటిపోయింది. మరింత అప్పు కావాలంటే ఖచ్చితంగా కేంద్రం పెట్టే షరతులను అంగీకరించాలి. ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని ఐదు శాతానికి పెంచుకోవాలంటే ఉచిత విద్యుత్‌ను రాష్ట్రంలో ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం షరతు పెట్టింది. ఈ షరతుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని విశ్వసనీయ సమాచారం.

కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతు వల్ల వచ్చే డబ్బుతో ప్రభుత్వం తన రోజువారీ ఖర్చులకు వాడుకోనుంది. అలాగే రైతులకు యొక్క విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే కట్టడమో లేదా రైతులు కరెంట్ బిల్లులు కట్టిన తరువాత తిరిగి చెల్లించడమో చేస్తారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ నిర్ణయం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని, అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాన్ని ఇప్పుడు జగన్ తొలగిస్తే వైసీపీ చెడ్డ పేరు వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here