ఆగస్ట్ 9న విజయవాడలో జరిగిన స్వర్ణా ప్యాలస్ అగ్ని ప్రమాదం ఘటన రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ ఘటనలో మొత్తం 10మంది మృతి చెందారు. స్వర్ణా ప్యాలస్ ను కోవిడ్ సెంటర్ గా మార్చిన రమేష్ హాస్పిటల్ ఎండీ రమేష్ కుమార్ పై కేసు నమోదు చేసింది. దీన్ని సవాలు చేస్తూ ఎండీ, ఛైర్మన్ ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. తమపై కేసును కొట్టేయాలంటూ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హై కోర్ట్ వారిపై తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో కోవిడ్ సెంటర్ కు అనుమతి ఇచ్చిన అధికారులది కూడా తప్పేనని హై కోర్ట్ తెలిపింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో తాజాగా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఎస్‌ఎల్పీ నంబర్‌ను కేటాయించనుంది. ఇప్పటికే అనేక సార్లు హై కోర్ట్ మరియు సుప్రీం కోర్ట్ ల దగ్గర చేదు అనుభవాలు ఎదుర్కొన్న ఏపీ ప్రభుత్వం ఈ కేసులో ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కోనుందో వేచి చూడాలి.