అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ, దిక్కు తోచని స్థితిలో జగన్

Advertisement

ప్రజలకు అవసరం ఉన్నా లేకున్నా కూడా రాజకీయ నాయకులు ప్రజలను ఉచిత సంక్షేమ పథకాలను ఆశ చూపిస్తూ ఉంటారు. ఈ పథకాలను అమలు చేయడానికి ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇప్పడు ఏపీలో ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన కేవలం 16నెలలోనే చాలా ఉచిత పథకాలను ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు ఏపీ ఖజానాలో కాసులు మాత్రం అస్సలు లేవు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా కేంద్రం దగ్గర అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఏపీ-తెలంగాణ రెండు రాష్ట్రాలుగా 2014లో విడిపోయాయి. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా అవతరించగా.. ఏపీ 90వేల కోట్ల అప్పుతో కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. నాడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఏపీ అభివృద్ధి పేరిట వేల కోట్లు అప్పులు చేశారు. ఇప్పుడు జగన్ 15నెలలు పరిపాలనలో ఏకంగా 97వేల కోట్ల రూపాయాల అప్పులు తెచ్చినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది ఎలా ఉన్నా ప్రస్తుతం ఏపీ సర్కారుకు బ్యాంకులు నుంచి రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. అంతే కాకుండా ఆర్బీఐ రుణపరిమితి కూడా ఏపీకి మించిపోయినట్లు సమాచారం.కేంద్రం ఏపీకి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. జగన్ ఈ ఖజానా సమస్యల నుండి ఎలా బయట పడుతాడో వేచి చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here