కోవిడ్ ఆసుపత్రి అగ్ని ప్రమాదంపై విచారణ వేగవంతం చేసిన ప్రభుత్వం

Advertisement

విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ ఘటన పై ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది. కోవిడ్ చికిత్స కోసం స్వర్ణ ప్యాలెస్ ను లీజ్ కు తీసుకున్న రమేష్ ఆసుపత్రి యొక్క యజమాని అయిన ముత్తవరపు శ్రీనివాస రావు ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నామని, కీలక పత్రాలు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ సూర్య చంద్రరావు తెలిపారు.

రమేష్ ఆసుపత్రి నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మంది కరోనా బాధితులను చేర్చుకుందని, బాదితుల నుండి లక్షల రూపాయలను బిల్లుల రూపంలో వసూలు చేశారని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో 10 మరణించగా, పలువురు గాయల పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియ ప్రకటించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ కూడా స్పందించి…మృతుల యొక్క కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here