ప్రవేట్ ఆసుపత్రుల్లో కరోనా టెస్టులకు ఏపీ ప్రభుత్వం అనుమతి
Admin - July 27, 2020 / 12:49 PM IST

ఏపీ సర్కార్ కరోనా కట్టడికి మరో నిర్ణయం తీసుకుంది. అయితే ICMR అనుమతించిన ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా పరీక్షలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం నుండి పంపే నమూనాలు, ప్రైవేటుగా సేకరించే నమూనాల పరీక్షలకు వైద్యారోగ్య శాఖ ధరలు నిర్ణయించింది.
అయితే ప్రభుత్వం సూచించిన ప్రకారం ప్రవేట్ ఆసుపత్రులలో మరియు ప్రవేట్ ల్యాబులలో పరీక్షలకు 750 రూపాయల ధర కంటే ఎక్కువ వసూలు చేయరాదు అని తెలిపింది. అలాగే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు కూడా 750 రూపాయల ధర కంటే ఎక్కువ వసూలు చేయరాదని తెలిపింది.
అలాగే ఆర్టీపిసిఆర్ ద్వారా చేసే పరీక్షలకు కూడా 2800 రూపాయల ధర నిర్ణయించింది. ఇక ఈ ధరలోనే ర్యాపిడ్ కిట్లు మరియు పీపీఈ కిట్లు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. అలాగే మానవ వనరుల వ్యయం కూడా కలిపి ఉంటుందని వైద్యారోగ్య శాఖ వివరించింది. ఆసక్తి ఉన్న ప్రవేట్ ఆసుపత్రులు మరియు ల్యాబులు దరఖాస్తు చేసుకోవాలి అని ప్రభుత్వం తెలిపింది.