ఆర్థిక ఇబ్బందులు ఎదొర్కొంటున్న ఆంధ్రప్రదేశ్

Advertisement

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక ఇబ్బంది నెలకొంది . రూపాయి కూడా ఖర్చు పెట్టలేని స్థాయిలోకి పడిపోయింది . నిధులు వాడలేక సమస్యలు ఎదుర్కొంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…అసలేం జరిగింది అన్న పూర్తి వివరాల్లోకి వెళితే.

ఆంధ్రప్రదేశ్ లో అప్ప్రోప్రియేషన్ బిల్లు ఆమోదం పొందకపోవడం తో ప్రస్తుతం నిధులు లేక ఎవ్వరికి జీతాలు కూడా అందచేసే పరిస్థితి కి రావడం జరిగింది అసలు ఈ అప్ప్రోప్రియేషన్ బిల్ అంటే ఏంటి? దాని వళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితి ఎందుకు స్తంభించింది అనుకుంటున్నారా? గవర్నెమెంట్ తన వద్ద ఉన్న విధులను వాడుకోవటానికి అధికారుల అంగీకారం తీసుకున్న పిదప ఒక బడ్జెట్ ఫైల్ ని రెడీ చేసి ఆ బిల్లు ని అంగీకారం కోసం గవర్నర్ వద్దకు పంపి పర్మిషన్ తీసుకుని బదిలీ చేసి ఆయన నుండి లోక్ సబ లో ప్రవేశ పెట్టి శాసన మండలి అధికారం పొంది. వారి వద్ద ఉన్న నిధులను, ఆ బిల్లు ఆమోదం పొందిన మొత్తం వరకు వాడుకొనే అవకాశాలు లభిస్తాయి . ఇలా ప్రవేశ పెట్టె బిల్లునే అప్రాప్రియేషన్ బిల్ అంటారు .

అయితే మొదటి సారిగా ఈ అప్ప్రోప్రియేషన్ బిల్ పాస్ కాకపోవడం వలన గత కొంత కాలం నుండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిధులు మొత్తం అయిపోవడం, కొత్త వాటిని వాడలేని పరిస్థితి ఏర్పడడం జరిగింది. దాని తో ప్రస్తుతం ఉద్యోగులకు కూడా జీతాలు అందించలేని పరిస్థితి కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనగా మరొక 3 రోజుల వరకు కూడా ఇలాగే కొనసాగనున్నట్లు తెలుస్తుంది. ఈ బిల్లు ని మరల పాస్ చేయించడానికి గవర్నర్ ని సంప్రదించి చర్యలు తీసుకొనే అవకాశం ఉన్నప్పటికీ. మండలి లో ప్రవేశపెట్టిన 14 రోజుల వరకు ఆ నిర్ణయం తీసుకోకూడదు. అయితే 14 రోజుల తరువాత చేయవలసిన యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది .

స్పీకర్ బిల్లు పాస్ కాలేదు అన్న విషయాన్నీ తెలుసుకొని పరిశీలించి బిల్ పాస్ కావడం లో ఆలస్యం అయింది అన్న విషయాన్నీ తెలియ చేసేవిధంగా ఒక ఫైల్ ని తయారు చేసి గవర్నర్ గారి అప్రూవల్ కి పంపించి ఆ అప్రూవల్ పొందిన తరువాత ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి వారి దగ్గర ఉన్న నిధులలో నుండి బడ్జెట్ లో ప్రవేశ పెట్టిన మొత్తాన్ని తీసుకోవచ్చు. అయితే ఇలా ఆంధ్రప్రదేశ్ అప్ప్రోప్రియేషన్ బిల్ పాస్ కాకపోవడం మొదటి సారి. ఒక్క సారిగా ఇలా జరగడం తో ముందస్తు జాగ్రత్తలు తీసుకోని ఎపి ప్రభుత్వం తమ దగ్గర ఉన్న పూర్తి నిధులన్నింటిని కోలిపోయి ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి కి రావడం జరిగింది .

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అప్పులతో నెట్టుకొస్తోంది అన్న విషయం ఈ విషయం గమనిస్తే తెలుస్తుంది ఇప్పటి వరకు ఎపి ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.54,257 కోట్లను అప్పుగా తీసుకుంటామని ప్రతిపాదించడం జరిగింది అయితే గడిచిన మొదటి మూడు నెలల్లోనే రూపాయలు 15 వేల కోట్లని అప్పు తీసుకొనగా వచ్చే మూడు నెలలకు మరో రూ. 14వేల కోట్ల అప్పు కావాలంటూ. ప్రతిపాదనలను ఆర్బీఐకి సమర్పించింది. ఈ లెక్కన చూసుకుంటే ఈ సంవత్సరం లో ఎపి కి అయ్యే అప్పు 60 వేల కోట్లు అంటే ప్రతిపాధించిన బిల్లు కంటే ఎక్కువ అన్న మాట .

ఈ విధంగా ఎక్కువ మొత్తం లో అప్పులు తీసుకుంటూ ముందుకు నెట్టుకుంటూ వెళ్తుంది ఏపీ ప్రభుత్వం అయితే ఇలా అప్పు గా తీసుకున్న మొత్తాన్ని కూడా జీతాలు, పెన్షన్లు, ఇతర పథకాలకు నగదు పంపిణీ రూపంలో మళ్లిస్తోంది… ఒక్క సారిగా ఈ బిల్లు కాస్త పాస్ కాకపోవడం అలాగే 14 రోజులు ముగియడం తో ఆ తరువాత చర్యలను గవర్నమెంట్ జరుపుతున్నట్లు తెలుస్తుంది ఈ విషయాని కి సంబంధించిన బిల్ ని గవర్నర్ ద్వారా మరొక రెండు మూడు రోజులలో ఆమోదం పొంది వాడుకోనున్నట్లు తెలుస్తుంది. కానీ ఇలా ఒక్క సారిగా ఆంద్రప్రదేశ్ లో ఎదురైన ఆర్థిక ఇబ్బంది వలన రాజకీయ సమస్యలు కూడా తలెత్తడం జరుగుతుంది.

ఇలా ఒక్క సారిగా తలెత్తిన ఆర్థిక ఇబ్బంది ని అవకాశం గా తీసుకొని చేతకాని ప్రభుత్వం అంటూ కొన్ని ప్రతిపక్షాలు దూషిస్తుండగా ఏపీ వ్యయసాయ శాఖ మంత్రి అయినటువంటి కన్నా బాబు లాంటి వారు మాత్రం ఇంత వరకు ఎప్పుడు కూడా బిల్ పాస్ కాకుండా ఆగిన దాఖలాలు లేవు. దీని వెనుక చంద్రబాబు హస్తం ఉండవచ్చు. ఆయన రాజకీయంగా ఓడిపోవడం, రాజకీయాలకు దూరం అవుతుండడం వలెనే ఇలాంటి చర్యలకు పాలు పడుతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇలా బిల్ ఆమోదం పొంది ఆంధ్రప్రదేశ్ లో నిధులను వినియోగించుకోవడానికి మరొక రెండు , మూడు రోజుల సమయం పట్టొచ్చు అంత వరకు ఏపీ లో ఆర్ధిక ఇబ్బంది మాత్రం ఎదొర్కొక తప్పదు అంట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here